అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలను సోమవారం జిల్లా కలెక్టర్ గిరీష స్వీకరించారు ఈ సందర్భంగా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారీయా, డిఆర్ఓ సత్యనారాయణ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.