శ్రీకాకుళం: వర్షాల జోరుతో పాలకొండ డివిజన్‌లో ఎక్కువ మంది డెంగీ వ్యాధి బారిన పడ్డారు. నాలుగు రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. తొలి దశలోనే అప్రమత్తం కాకపోతే పెద్ద మూల్యమే చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. డెంగీ వ్యాధి లక్షణాలు ఇవే.. తీవ్రమైన జ్వరం, వాంతులు, విరేచనాలు, కంటి నొప్పి, మంట, తలనొప్పి, చర్మ సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, మలమూత్రాలలో రక్తం పడటం , కడుపునొప్పి, జలుబు, దగ్గు, నీరసం.