జార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో దారుణం జరిగింది. నమ్‌కుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికకు చాక్లెట్లు కొనిస్తానని 22 ఏళ్ల యువకుడు ఇటీవల ఆశ చూపాడు. అభంశుభం తెలియని బాలిక ఆ యువకుడితో వెళ్లగా నిర్మానుష్య ప్రదేశంలో నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై రాంచీ ఎస్పీ (రూరల్) నౌషాద్ ఆలం స్పందించారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్ప్రతికి పంపించామని తెలిపారు