ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం పేరుతో దోచుకుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇసుక కంటే బంగారమే ఈజీగా దొరుకుతోందన్నారు. కళ్ల ముందు ఉండే ఇసుక ప్రజలకు లబ్యం కావడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.5 వేలకు లభ్యమైన ఇసుక ప్రస్తుత ధర రూ.13 వేలకు చేరిందన్నారు. దీని వల్ల ఎంతో మందికి ఉపాధి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.