కడప జిల్లా రాజంపేట నియోజకవర్గము సిద్ధవటం ఐసిడిఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని సిద్ధవటం ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీదేవి పేర్కొన్నారు. ఆమె సోమవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ 21 నుండి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని అన్నారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.