పట్టభద్రుల పశ్చిమ రాయలసీమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి మంగళవారం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రచారం చేపట్టారు. తనను ఆశీర్వదించి ఓటు వేయాలని ప్రచారంలో అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవని, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ అందక చదువును మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు.