మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని రాజాం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి కోండ్రు మురళీమోహన్ తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజాం సిఐ కె. రవి కుమార్ ను కోరారు. రాజాం పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి మంత్రి కొడాలి నాని పై టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజాం పోలీస్స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు నిత్యం కొడాలి నాని చేస్తున్నారన్నారు.
చంద్రబాబు, లోకేష్ తో పాటు పలువురు టిడిపి నాయకులపై మాట్లాడడానికి వీలు లేని విధంగా మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని పెద్ద సైకో అని అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని తో పాటు పలువురు మంత్రులు అదే పనిగా టీడీపీ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. తక్షణమే కొడాలి నాని ని ఎమ్మెల్యే పదవి నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు కొల్ల అప్పలనాయుడు, గురవాన నారాయణరావు, అశోక్ కుమార్ తో పాటు 300 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.