ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడు రాజధానులపై రెఫ‌రెండ‌మ్‌గా అసెంబ్లీని రద్దు చేయాలి : టీడీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 08:45 PM

రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో... ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బుధవారం ఓ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. వచ్చే ఎన్నికలకు 3 రాజధానుల ప్రతిపాదనతో వెళతామని వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. 3 రాజధానులపై రెఫ‌రెండ‌మ్‌గా అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. 3 ముక్కల రాజధానిపై జగన్ కు నమ్మకం ఉంటే వెంటనే అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే డిమాండ్‌ వినిపిస్తుందని ఆ పార్టీ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa