మహాకవి గుర్రం జాషువా జయంతి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణానగర్ లోని తన కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో హైకోర్టు న్యాయవాది గడ్డం ఎలీషా, డీబీఎఫ్ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, బాలస్వామి పలువురు నాయకులు పాల్గొన్నారు.