ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. కీవ్ లో నగరంలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. దీంతో జెలెన్స్కీ కి స్వల్ప గాయాలయ్యాయని, ఆస్పత్రికి తరలించినట్లు ఉక్రెయిన్ మీడియా తెలిపింది. జెలెన్స్కీ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆయన ప్రతినిధి సెర్హిల్ జికిఫొరోవ్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. అదృష్టవశాత్తూ జెలెన్స్కీ క్షేమంగా బయటపడ్డారు.