అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా వారికి సంఘీభావం తెలియజేయడానికి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లో ప్రవాస ఆంధ్రులు నిర్వహించిన ర్యాలీలో టీడీపీ నాయకులూ బోండా ఉమా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా అమరావతిని సర్వనాశనం చేశాడు. అదే అమరావతి ఈరోజు ఉండి ఉంటే రాష్ట్రానికి అప్పులు చేసే పరిస్థితి వచ్చేది కాదు. మందికి ఉపాధిని కల్పించే మహా మహానగరాన్ని జగన్ రెడ్డి కుప్ప కూల్చాడు అని ఆవేదన వ్యక్త పరిచారు.