జగనన్న హౌసింగ్ కాలనీ లేఅవుట్లలో కొత్త ఇళ్ల నిర్మాణాలను సత్వరం ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ డా. జె అరుణ హౌసింగ్ అధికారులు, వార్డు అమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ అనుప్పల్లి లేఅవుట్ ను సందర్శించారు. స్థానికంగా ఇళ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేగంగా ఇల్లు నిర్మించుకోవాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం హౌసింగ్ అధికారులు, వార్డు అమినిటీ కార్యదర్శులతో వార్డుల వారీగా సమీక్ష నిర్వహించారు.