బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోడి పందాల స్థావరాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి కోడిపందాలు ఆడుతున్న 19 మందిని అదుపులోకి తీసుకొని రూ. 24,320/-, మరియు 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు. జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి అక్రమాలకు, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టం తీవ్ర స్థాయిలో శిక్షిస్తుంది అని హెచ్చరించారు. జూదానికి అలవాటై, మీ కుటుంబాలు నాశనం చేసుకోవద్దు అని తెలియజేసారు.