పనిచేసేవారిని ప్రోత్సహించడంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఉంటారన్నది మరోమారు రుజువైంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తొలి రోజున అసెంబ్లీ లాబీల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శాసనసభా సమావేశాల కోసం అసెంబ్లీకి వస్తున్న జగన్‌ను కలిసేందుకు అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా కుప్పం వైసీపీ ఇంచార్జీగా ఉన్న ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్.. జగన్‌ను కలవగలిగారు.
ఈ సందర్భంగా ఆయనను జగన్ 'భరత్ ద గ్రేట్' అంటూ సంబోధించారట. అంతేకాకుండా బాగా పనిచేస్తున్నారంటూ భరత్‌ను భుజం తట్టిన జగన్ మరింతగా ప్రోత్సహించారు. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ జగన్ తన భుజాన్ని తడుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భరత్... జగన్ తనకు ఇచ్చిన ప్రశంసను కూడా ప్రస్తావించారు. జగనన్న అభినందించడం సంతోషంగా ఉంది అంటూ భరత్ ఉప్పొంగిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa