తమిళనాడులోని చెన్నైలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీ కారిడార్‌లో రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగులను వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన ఎస్.లావణ్య(23), కేరళకు చెందిన లక్ష్మి(24) మృతిచెందారు. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా వారిపైకి కారు 130 కి.మీ వేగంతో దూసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ మోహిత్ (20)ను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa