విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ లెక్చరర్ దారుణంగా ప్రవర్తించాడు. క్లాస్లో మాట్లాడాడనే కోపంతో విద్యార్థిపై గురువారం దాడి చేశాడు. చెంప దెబ్బలతో పాటు కాలితో తన్నాడు. లెక్చరర్ దురాగతాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి రవికుమార్, డీఈవో రేణుక కళాశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. లెక్చరర్ నుంచి ఉద్యోగం నుంచి తొలగించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది.