ఒడిశాలోని ఝార్సుగూడలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కార్మికులతో కూడిన బస్సును బొగ్గు రవాణా చేస్తున్న ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో 14 మందిని స్థానిక ఆసుపత్రికి మరో 10 మందిని బుర్లా, సంబల్పూర్లోని ఆసుపత్రులకు తరలించారు. చనిపోయిన, గాయపడిన వారంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని పోలీసులు పేర్కొన్నారు.