చాలా మంది అమ్మాయిలు ముఖంపై నల్లమచ్చలతో భాదపడుతుంటారు. అయితే ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చల్ని తులసి ఆకుల సాయంతో పోగొట్టుకోవచ్చు. ఇందుకోసం తులసి ఆకుల రసాన్ని తీసుకోవాలి. దీనికి అంతే మోతాదులో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒకసారి చేయాలి. ఇలా చేస్తే ముఖంపై నల్లమచ్చలు తగ్గి, చర్మం కాంతివంతంగా మారుతుంది.