ఉదయం నిద్రలేచిన వెంటనే 2 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇది రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆ తర్వాత జాగింగ్ చేయాలి. ప్రాణాయామం, యోగా చేయాలి. ఇవి చేస్తే ఒత్తిడి తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైరస్ ల బారిన పడకుండా ఉండేందుకు ఆవిరి పట్టుకోవడం చేయాలి. ఆరోజు చేయాల్సిన పనులేంటో డైరీలో రాసుకోవాలి. అల్పాహారం తప్పకుండా చేయాలి. రోజును ఆనందంతో, విశ్వాసంతో ఆరంభిస్తే విజయం తప్పక సొంతమవుతుంది.