మధ్యప్రదేశ్ రీవా జిల్లాలో శనివారం దారుణం జరిగింది. నైగర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక, ఆమె స్నేహితుడు గుడికి వెళ్లారు. ఇంతలో ఇద్దరు మైనర్లు సహా ఆరుగురు నిందితులు అక్కడకు వచ్చారు. బాలిక స్నేహితుడిని కొట్టి, బాలికపై వారంతా సామూహిక అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత నిందితుల ఇళ్లను అధికారులు కూల్చేశారు.