ప్రియురాలిని ఓ వ్యక్తి చంపి, పెరట్లోనే పాతిపెట్టాడు. ఈ దారుణం ఛత్తీస్గఢ్ రాయగఢ్లో జరిగింది. ఖగేశ్వర్తో కాంతి యాదవ్ అనే మహిళ సహజీవనం చేస్తోంది. వీరిద్దరికీ వేర్వేరుగా వివాహాలై, పిల్లలున్నారు. వాళ్లను వదిలి వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఇక కాంతి ఫోన్ 17 రోజులుగా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో అనుమానం వచ్చి ఆమె అక్క ఆరా తీయగా హత్య బయటపడింది. నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.