విశాఖపట్నం: సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అనకాపల్లి జిల్లా దేవరపల్లె మండల కేంద్రం కొల్లూరు వారి వీధిలో ఉండే వికలాంగుడైన చెక్కా శ్రీనుకు చెందిన ఫోటో స్టూడియోలో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయతించారు. వర్షం కారణంగా అప్పటివరకు కరెంట్ లేదని సాయంత్రం 4 గంటల వరకు షాప్ లో ఉండి వెళ్లానని , కరెంట్ వచ్చిన వెంటనే ప్రమాదం జరిగిందని శ్రీను తెలిపాడు. ప్రమాదం జరిగినప్పుడు శ్రీను షాప్ లో ఉంటే అతని ప్రాణాలు పోయేప్రమాదం ఉండేదని స్థానికులు అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాలంటీర్ పద్మ స్పందించి పై అధికారులకు సమాచారం అందించడంతో ఆమెను స్థానికులు మెచ్చుకున్నారు. ప్రమాదానికి కారణాలేంటో నిర్ధారించాల్సి ఉంది.