ఢిల్లీలోని లక్ష్మీనగర్ కు చెందిన ఓ నగల వ్యాపారి భార్య తన భర్త ఫ్రెండ్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో ఉన్న నగలు, నగదు తీసుకొని ప్రియుడితో పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తాను సీక్రెట్ కెమెరాలు పెట్టి అత్తమామల నగ్న వీడియోలు తీశానని, వాటిని వైరల్ చేస్తానని ఆ మహిళ భర్తను బెదిరించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.