కిడ్నీలు మన శరీరంలోని మలినాలను లేదా విషపూరితాలను బయటకు పంపించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాటి పనితీరు సక్రమంగా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైతే కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తే కొద్దికాలం తర్వాత కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వచ్చినప్పుడు షుగర్ స్థాయిలను నియంత్రించుకోవాలి. వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ ఉండాలి.
- అధిక రక్త పోటు సైతం కిడ్నీల వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి.
- శరీరానికి పాస్ఫరస్, కాల్షియం చాలా అవసరం. తాజా పండ్లు, కూరగాయలు, మొక్కజొన్న, మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాల పదార్థాల ద్వారా పాస్ఫరస్, కాల్షియాన్ని శరీరానికి అందించవచ్చు. అయితే అధిక మోతాదులో తీసుకోకూడదు.
- రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
- రాజ్మా ఉడికించిన నీళ్లు, గోరువెచ్చని నీళ్లు తాగితే కిడ్నీలకు మంచిది. అనవసరమైన లవణాలను శరీరం నుంచి బయటకు పంపించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
- బీపీ, డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి.
- సమ్మర్ లో నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతుండాలి.
- చలికాలంలో టమాట సూప్, పాలకూర సూప్, కూరగాయల సూప్ తాగాలి.
- నొప్పి మాత్రలు వాడకపోవడమే మంచిది.
- పొటాషియం కోసం కూరగాయలు, ఆలూ, అరటిపండ్లు అవకాడో, కమలాపండ్లు, టమాటాలు, క్యారెట్లు తీసుకోవాలి. ఆపిల్స్, కాన్‌బెర్రీ, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, క్యాబేజీ, కాలీఫ్లవర్, దోసకాయల్లో పరిమితంగా పొటాషియం ఉంటుంది. వీటిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పొటాషియంను అందించవచ్చు. అదే సమయంలో కిడ్నీలపై అధిక ఒత్తిడి లేకుండా చూసుకోవచ్చు.