చిత్తూరు: బంగారుపాల్యం మండలం, నల్లం గాడు చెరువు వద్ద హత్యయత్నం కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి ఇరువర్గాలపై కేసు నమోదు చేసి 12 మంది ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మల్లికార్జున రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆయన కథనం మేరకు వివరాలు. వర్షాలు పడి చెరువులు నిండి ఉండడంతో మాణిక్యం అనే రైతు పొలంలో నీరు చేరుకుపోవడంతో నల్లం గాడు చెరువు సంబంధించిన ఆరు నెలల క్రితం తగ్గువారి పల్లికి చెందిన ముజీబ్ అనే అతనికి వేలంలో ఇవ్వబడిందని మాణిక్యమైన పట్టా భూమిలో కూడా నీరు ఉండడంతో చేపలు పట్టుకుంటానని మాట ఇవ్వడం జరిగిందన్నారు.
16వ తేదీ రాత్రి మాణిక్యం చేపలకు వలవేసి ఉండంగా ముజీబ్ మరియు అతని అనుచరులు 6 మంది అక్కడి చేరుకుని వలవే వెయ్యాలంటే అడిగి వేయాలని నష్టం వాటిల్లుతుందని మాట మాట పేరిగి ఇరు వర్గాలు కట్టలతో రాళ్లతో దాడి చేసుకోవడం జరిగిందన్నారు. బంగారు పాల్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగిందని అనంతరం ఇచ్చిన ఫిర్యాదుపై మేరకు పూర్తిగా విచారించి మాణిక్యం సహచరులు 6 గురు నల్లంగాడు గ్రామస్థులు ముజిబి అతని అనుచరులు 6గురు తగ్గువారీపల్లె కు చెందిన ఇరువర్గాల పై హత్య యత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.