జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రం(ఆర్టీపీపీ)లోని ఒకటో యూనిట్ లో బాయిలర్ ట్యూబుల లీకేజీతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు సోమవారం అధికారులు తెలిపారు. ఆర్టీపీపీలోని మొత్తం 6 యూనిట్లలో కలిపి 1, 650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 4 యూనిట్లలో కలిపి సుమారు 600 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. దాదాపు గత నెల రోజులుగా 6వ యూనిట్లో సమస్య ఏర్పడటంతో ఉత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం ఒకటో యూనిట్లో బాయిలర్ ట్యూబుల లీకేజీతో ఉత్పత్తి నిలిపి వేశారు. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ మురళీకృష్ణ మాట్లాడుతూ ఒకటో యూనిట్ ట్యూబుల లీకేజీతో ఉత్పత్తి నిలిపివేశామని, సమస్యను పరిష్కరించి అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa