కర్ణాటకలో ప్రముఖ పర్యావరణవేత్త, రాజ్యోత్సవ అవార్డు గ్రహీత సాలుమరద వీరాచారి సూసైడ్ చేసుకున్నారు. మిట్లకట్టె గ్రామంలో తాను నాటి, పెంచిన చెట్టుకే మంగళవారం ఉరేసుకున్నారు. పేదలకు న్యాయం చేయడంలో విఫలమైతే ఉరికంబం ఎక్కుతానని గతంలోనే ప్రకటించిన ఆయన గ్రామంలోని రేషన్ షాప్ లో అక్రమాలు జరుగుతున్నాయని 20 ఏళ్లుగా పోరాడుతున్నారు. అయితే రేషన్ షాప్ మూసేయకుండా కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన సూసైడ్ చేసుకున్నారు.