ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో దారుణం జరిగింది. సీతారామాపురానికి చెందిన వెంకటేశ్వరరావు, జ్యోతి దంపతులకు కుమార్తె జ్యోత్స్న(6), కుమారుడు షణ్ముఖ వర్మ(4) ఉన్నారు. బతుకుదెరువు కోసం దంపతులిద్దరూ పెదకాకాని వచ్చారు. ఇటీవల వారి మధ్య గొడవలు జరిగాయి. భార్య తనపై పీఎస్ లో ఫిర్యాదు చేసిందన్న కోపంతో వెంకటేశ్వరరావు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి కాలువలో పడేశాడు. పోలీసుల విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు.