తెనాలి: వివాహం చేయడం లేదని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు పట్టణానికి చెందిన శ్రీకాంత్ (24) తనకు వివాహం చేయడoలేదని తల్లిదండ్రులపై అలిగి మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ సీఐ యు. శ్రీనివాసులు తెలిపారు.