గుంటూరు జిల్లా తాడేపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహిళ మెడలోని నానుతాడు ను దొంగిలించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు గుంటూరు కు చెందిన బండి పాండు, భార్య సుజాత, కుమారునితో కలిసి విజయవాడలోని ఆయన తల్లి ఇంటికి వెళ్లి బైక్ పై తిరిగివస్తుండగా తాడేపల్లి జాతీయ రహదారిలో గుర్తుతెలియని దుండగులు వెంబడించి తన భార్య మెడలోని 10గ్రాముల బంగారపు సూత్రాలతో ఉన్న నాన్ తాడు అపహరించుకు పోయినట్లు తెలిపారు. ఘటనపై సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.