మొహాలీలో జరిగిన టీ20 ఓటమికి జస్ప్రీత్ బుమ్రా జట్టులో లేకపోవడం ప్రధాన కారణమని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అన్నాడు.ఇకపోతే బుమ్రా లేక భారత బౌలింగ్ ఔట్‌ఫిట్ మరోసారి పేలవంగా కన్పించింది. భారత బౌలర్లు 208 పరుగుల భారీ స్కోరును కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మ్యాచ్ చివరి ఓవర్లలో భారత బౌలర్లు భారీ పరుగులు చేశారు. ఫలితంగా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పాండ్యా మాట్లాడుతూ.. బుమ్రా జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. అయితే గాయం నుంచి కోలుకుని జట్టులోకి రావడానికి తగిన సమయం ఇవ్వాలని అన్నాడు. జస్‌ప్రీత్ జట్టుకు దూరమవడం జట్టులో పెనుమార్పు తెస్తుంది. గాయం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను పూర్తిగా కోలుకోవడానికి తగినంత సమయం పొందడం ముఖ్యం. అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. అతను జట్టు కోసం ఏమి చేయగలడో.. జట్టుకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. జట్టు పరంగా బౌలింగ్‌పై కొంత ఆందోళన నెలకొంది. కానీ అవి సమసిపోతాయి అని అన్నాడు.