మహిళల ఆసియా కప్ - 2022 T20 టోర్నమెంట్ వచ్చే నెల నుండి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత మహిళల జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. నిన్న జరిగిన ఆసియా కప్ పురుషుల టోర్నీ సూపర్ 4 దశలో భారత్ ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల జట్టు ఆసియా కప్ లోటును ఆసియా కప్ టైటిల్ తో భర్తీ చేస్తుందో లేదో చూడాలి. లేదంటే మహిళల టీ20 ఆసియాకప్‌లో భారత్ వుమెన్ వర్సెస్ పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 7న జరగనుంది.ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా మంగళవారం ప్రకటించారు.
ఆసియా కప్ మహిళల టోర్నీ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 1 నుంచి 15 వరకు 15 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది.ఈ టోర్నీలో ఏడు జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో టోర్నీ నిర్వహించనున్నారు. ప్రతి జట్టు మరో జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో విజేతలు అక్టోబర్ 15న జరిగే ఫైనల్‌లో తలపడతారు.
మహిళల ఆసియా కప్ లో భారత్ షెడ్యూల్:
ఇకపోతే ఈ టోర్నీలో తొలిరోజు అక్టోబర్ 1న శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఆసియాకప్ వుమెన్స్ టోర్నీలో చెప్పుకోదగ్గ టీంలో శ్రీలంక కూడా ఒకటి. ఇక భారత్ అక్టోబర్ 3న మలేషియాతో, అక్టోబర్ 4న యూఏఈతో, అక్టోబర్ 7న పాకిస్తాన్‌తో అక్టోబర్ 8న ఆతిథ్య బంగ్లాదేశ్‌తో, అక్టోబరు 10న థాయిలాండ్‌తో మ్యాచ్‌లు ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు టాప్ 4లో ఉండడం ఖాయం కాబట్టి.. అక్టోబర్ 11 లేదా 13న జరిగే సెమీఫైనల్స్‌లో భారత్ మరో జట్టును ఎదుర్కొంటుంది. సెమీఫైనల్లో గెలిస్తే అక్టోబర్ 15న ఫైనల్ ఆడనుంది. ఇకపోతే ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఆసియాకప్ టోర్నీకి భారత వుమెన్స్ టీం: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్-కీపర్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుక వస్త్రాకర్, రాజేశ్వరి గయాక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవగిరే
స్టాండ్‌బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్.