బీజేపీ పార్టీ తో పొత్తులో ఉండి కూడా ఎన్టీఆర్కు భారతరత్న సాధించలేని దద్దమ్మ చంద్రబాబు అని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. అసెంబ్లీ చివరి రోజు కూడా సభను సజావుగా జరగనివ్వకుండా టీడీపీ అడ్డుకుంటోందన్నారు మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంశంపై చర్చ జరిపి మాట్లాడాలని అన్నారు.
నిజంగా టీడీపీ వారికి ఎన్టీరామారావు మీద చిత్తశుద్ధి ఉందా? ఎన్టీరామారావు గారి ఆత్మ క్షోభించే విధంగా ఆయన పెట్టిన పార్టీని, పార్టీ గుర్తుని, ఆయన కట్టిన తెలుగుదేశం పార్టీఆఫీస్ ని లాక్కుని నేడు ఎన్టీఆర్ మీద ప్రేమ ఉందని అంటున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు ప్రేమ లేదని, వైయస్ జగన్ కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని తెలిపారు. అందుకే నాడు పాదయాత్రలో నిమ్మకూరులో ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉండేలా కృష్ణాజిల్లాకు పెడతానని చెప్పి, ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేసి చూపించారని తెలిపారు.