ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని అడవిలో విషాదం చోటు చేసుకుంది. రసూల్పూర్ గ్రామంలోని పాఠశాలో వీరేంద్ర(40) అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే 9వ తరగతి విద్యార్థిని (17)తో ఎఫైర్ పెట్టుకున్నాడు. అయితే ఈ ఇద్దరూ సెప్టెంబర్ 3 నుంచి కనిపించకుండా పోయారు. అడవిలో ఓ చెట్టుకు వారిద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.