కావలసిన పదార్థాలు: క్యారెట్: రెండు, ఎగ్స్: నాలుగు, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు: ఒక కప్పు, వెల్లుల్లి: రెండు రెబ్బలు, వెన్న: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, కారం: ఒక టీస్పూన్, మిరియాలపొడి: తగినంత
తయారీ విధానం: ఓ పాత్రలో వెన్న వేడయ్యాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కలిపి, బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన మిశ్రమంలో గుడ్లు, కారం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్‌మీద పొంగనాల ప్లేట్ పెట్టుకుని వెన్న వేసి, వేడయ్యాక మిశ్రమాన్ని గుంతల్లో పోసుకుని రెండువైపులా కాల్చుకుంటే సరి. క్యారెట్ ఎగ్ పొంగనాలు సిద్ధం.