ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికార పార్టీ వైసీపీకి సన్నిహితంగా మెలుగుతున్న వల్లభనేని వంశీ స్పందించారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం అభినందనీయం అన్నారు. అయితే కారణజన్ముడైన ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి కొనసాగించాలన్నారు. ఆ యూనివర్సిటీ ఎన్టీఆర్ చొరవతోనే ఏర్పాటైందని గుర్తు చేశారు.