టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటాకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా ఆయనను బుధవారం నామినేట్ చేసింది. రతన్ టాటాతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాలను ట్రస్టీలుగా నామినేట్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన అమిత్ షా, నిర్మలా సీతారామన్లు మంగళవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.