కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో మనోజ్ కర్జగి అనే కాంగ్రెస్ నాయకుడు ఒక సెలున్ షాపు నిర్వహిస్తున్నాడు. అక్కడి పార్లర్ లో బ్యూటీషీయన్ గా పనిచేసే యువతి సింగిల్ గా ఉండటాన్ని గమనించిన మనోజ్ తన కోరిక తీర్చాలంటూ ఆమెను బలవంతం చేశాడు. ఆమెకు ముద్దులు పెట్టాడు. ఈ క్రమంలో ఆమె వెంటనే తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేయగా, వారు వచ్చి మనోజ్ ను చావబాదారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.