బుధవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు, కాకినాడ జిల్లా పరిధిలోని పెదపూడి పోలీస్టేషన్లో ఒక మైనర్ బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు పై పెదపూడి పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలికను వెంటనే వెతకి కనుగొనమని ఆదేశాల జారీ చేశారు. SP ఆదేశాలు మేరకు కాకినాడ డిఎస్‌పి వి. భీమరావు సూచనలతో కాకినాడ రూరల్ సి.ఐ. శ్రీ కె. శ్రీనివాస్ పర్యవేక్షణలో పెదపూడి ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి, వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం 3 గంటల వ్యవధిలో మధ్యాహ్నం రెండుగంటల కల్లా ఈ కేసును ఛేదించి, మైనర్ బాలిక ను బిక్కవోలు మార్గంలో గుర్తించి, ఆమెను ఆమె తల్లిదండ్రులకు అప్పగించడమైనది. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన పెదపూడి పోలీసులకు, జిల్లా ఎస్పీ గార్కి ఆమె తల్లి కృతజ్ఞతలు తెలియజేశారు.