మ్యుటేషన్ దరఖాస్తులను ఎలాంటి పెండింగ్ ఉంచరాదని, గడువులోపు దరఖాస్తులను పరిష్కరించాలని సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ చేతన్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి మ్యుటేషన్ లు, రెవెన్యూ అజమాయిష్, రీ సర్వే తదితర అంశాలపై పెనుకొండ సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్ లతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తహసిల్దార్, విఆర్ఓ లాగిన్ లలో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.