జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం విద్యార్థులకు మందులు అందించారు. నులి పురుగుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రతి చిన్నారికి ఆల్ఫెండజోల్ మాత్రలు అందించాలని వైద్యాధికారి దయాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శంకరయ్య, వైద్య సిబ్బంది, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.