బీహార్‌లోని కాటిహార్ జిల్లా ప్రాణ్పుర్ పోలీస్ స్టేషన్ లో ఓ ఖైదీ మరో వ్యక్తితో మాట్లాడుతూ అకస్మాత్తుగా మరణించాడు. ప్రమోద్ అనే అక్రమ మద్యం స్మగ్లింగ్ కేసు నిందితుడు లాకప్ లోనే కన్నుమూశాడు. మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్టుండి పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మృతుని గ్రామస్థులు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారు. 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు చేపట్టామని కాటిహార్ ఎస్ఐ జితేంద్ర తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa