కడప నగరపాలక సంస్థకు 2013 సంవత్సరం నుండి ఆర్టీసీ అధికారులు పాతబస్టాండ్ కు చెల్లించాల్సిన పన్ను రూ. రెండు కోట్లు పైగా పెండింగ్ పెట్టడం సమంజసం కాదని, తక్షణమే నగరపాలక సంస్థకు చెల్లించాలని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి. చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నగరపాలక అధికారులు ఆర్టీసీ బస్టాండ్ లోకి బస్సులు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా అయినా ఆర్టిసి అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈ సమస్యకు దారి తీసిందని వారు విమర్శించారు. కడప నగర పాలక యంత్రాంగం అనేకసార్లు ఆర్టీసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువచ్చిన స్పందించకపోవడం వల్లనే ఈ పరిస్తితి దాపురించిందని వారున్నారు. ఇటు కార్పొరేషన్ అధికారులు కూడా బస్సులను బస్టాండ్ లోకి వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించడమే అన్నారు.
కార్పొరేషన్ కు ఆర్టిసి అధికారులు తక్షణమే పన్ను బకాయిలు చెల్లించి సమస్యను పరిష్కరించేలా చూడాలని వారి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ చైర్మన్, డిప్యూటీ సీఎం తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.