రోడ్డు సౌకర్యం లేక వారం రోజులు వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన దేవరాపల్లి మండలంలో చోటుచేసుకుంది. దేవరాపల్లి మండలం, చింతలపూడి పంచాయతీ సివారు వీలబద్రపేట గ్రామంలో వారం రోజులు వ్యవధిలో రోడ్డు సౌకర్యం లేక మేరుగైన వైద్య అందక గమ్మేల ప్రవీణ్, సూకురిచిన్నారి ఇద్దరు చిన్నారులు మృతి చేందారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న తెలిపారు ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అలాగే గురువారం గమ్మేల కావ్య అనే చిన్నారికి ఆరోగ్యం బాగలేక పోవడంతో 108 వాహనానికి పోన్ చేయగా గ్రామంలోకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దాదాపుగా కిలోమీటారు దూరం చేతులు మీదుగా మోసుకోచ్చి, కాశీపురం రోడ్డుపై అడ్డంగా రాళ్ళు కుప్పలు వేయడంతో వీరభద్రం పేట జంక్షన్ నుండి సీతం పేట వరకు ఐదు కిలోమీటార్లు దూరం బైకపై తీసుకువచ్చి 108 వాహనానికి ఎక్కించారని తెలిపారు, ఇన్ని కష్టాలు పడుతున్న ప్రభుత్వానికి, అధికారులకు కనీసం పట్టడం లేదన్నారు. 75 ఎళ్ళు స్వాతంత్ర్య పండగ చేసుకున్న ప్రభుత్వానికి గిలిజనులకు కనీసం రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం దారునమన్నారు. అసెంబ్లీలో రెండు రోజులు విద్యా, వైద్యం, రోడ్లు, నాడు నేడు పనులపై సుదీర్ఘమైన చర్చలు జరిపిన ప్రభుత్వ, గిరిజనులు ప్రాణాలు పట్ల లెక్కలేదన్నారు, ఫలితంగా డోలిమొతలు, మరణమృదంగాలు తప్పడం లెదన్నారు. జంతువులు ప్రాణాలకు ఉన్న విలువ కూడా గిరిజనులు ప్రాణాలకు లేదా అని ప్రశ్నించారు. రెండు రోజులు క్రితం శంకరం పంచాయతీ కొత్తవలసలో చివేరికొండలరావు కు వైద్యం అందక చనిపోయారని పేర్కొన్నారు