తన కాలేయాన్ని దానమిచ్చి కొడుకును బ్రతికించుకున్నాడో తండ్రి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 6 నెలల చిన్నారి బిలియరీ అట్రేసియా అనే కాలేయ వ్యాధి బారిన పడ్డాడు. బాలుడిని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తండ్రి సూరజ్ బాబ్షా చేర్చారు. శస్త్రచికిత్సకు రూ.15 లక్షలు అవసరమవడంతో భూమిని అమ్మేశాడు. అంతేకాకుండా డాక్టర్ల సూచనతో తాజాగా తన కాలేయాన్ని దానమిచ్చాడు. ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.