బ్రేకప్ చెప్పిన ప్రియురాలి విషయంలో ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. జార్ఖండ్‌కు చెందిన మహ్మద్ తంజీమ్ అహ్మద్ స్కెచ్ ఆర్టిస్ట్. అతడితో ఢిల్లీకి చెందిన యువతి ప్రేమలో పడింది. ఇటీవల ప్రియుడి ఫోన్లో తన ప్రైవేట్ ఫొటోలు చూసి అతడికి యువతి బ్రేకప్ చెప్పింది. ఇది తట్టుకోలేక ఆ ఫొటోలను నిందితుడు ఆన్లైన్లో పెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.