ఉక్రెయిన్ పై యుద్ధానికి 3 లక్షల సైన్యాన్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న రష్యా.. ఆ దేశ విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలు, ఎయిర్ పోర్టుల్లో పనిచేసే సిబ్బందిని తక్షణం సైన్యంలో చేరాలని సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ చర్యలతో పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాన్ని విడిచిపోతుండగా.. 18-65 ఏళ్ల వయసున్న పురుషులకు టికెట్లు విక్రయించవద్దని విమానయాన సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.