ఏపీ లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ గా మార్చడంపై వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం వైయస్సార్ పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని అవమానించినట్లు అవుతుంది. న్ఏటీఆర్ ఖ్యాతిని వైయస్సార్ కు ఇవ్వాల్సిన అవసరం లేదు. వైయస్సార్ కు ఉన్న పేరు ప్రఖ్యాతలు ఈ ప్రపంచంలో ఎవరికీ లేవు' అని చెప్పారు.