కంటిపట్ల విద్యార్థినులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బెంగుళూర్ లయన్స్ క్లబ్ కు చెందిన నేత్ర వైద్య నిపుణులు అర్చన పేర్కొన్నారు. శనివారం ధర్మవరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 600 మంది విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల చైర్మన్ బండి వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి బెంగళూరు లయన్స్ క్లబ్ వారితో పాటు స్థానిక లయన్స్ క్లబ్ వారు తమ సహాయ సహకారాలను అందించారు.