పురాతన కాలం నుంచి పశువుల సాయంతో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం సాగులో యాంత్రీకరణ ఎక్కువైంది. ఈ తరుణంలో ఓ రైతు సరికొత్త ఆవిష్కరణ చేపట్టాడు. ఎద్దుల బండితో ట్రెడ్మిల్ తరహా యంత్రం తయారు చేశాడు. దానిపై ఎద్దును నడిపిస్తూ వ్యవసాయానికి అవసరమైన నీటిని తోడడంతో పాటు, కరెంటును స్వయంగా ఉత్పత్తి చేస్తున్నాడు. ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు విశేష స్పందన వస్తోంది. కొందరు నెటిజన్లు మాత్రం పశువులను హింసిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.